Niharika-With-Amitabh-Bachchan on saira sets

మెగా డాటర్ తో మెగా స్టార్ :


మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి గారాల పట్టీ నిహారిక కొణిదెల. ఆ గారాబం మెగాస్టార్కి మిత్రుడైన నేషనల్ మెగా స్టార్కి మాత్రం ఉండదా! అందుకే ప్రేమగా భుజం మీద చెయ్యేసి ఫోటోలకి ఫోజులిచ్చాడు బిగ్ బీ . అమితాబ్ ను కలిసిన ఆనందంలో ఆశ్చర్యపోతూ నవ్వుతూ ఫోటోలకి ఫోజిచ్చింది నిహారిక. అతి పెద్ద మెగాస్టార్ని కలిసిన మెగా ఆనందంతో ఆమె మొహం వెలిగిపోతోంది కూడా.

 చిరంజీవి 151 వ చిత్రం ‘సైరా’లో అమితాబ్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం తరుచూ ఇక్కడికి వస్తున్నాడు బిగ్ బీ. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఆయనను కలిసింది. గుర్తుగా ఓ ఫోటో కూడా తీయించుకుంది. దాన్ని వెంటనే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అభిమానులతో పంచుకుంది. ఓవర్ వెల్మ్డ్ అంటూ కామెంట్ కూడా పెట్టింది. మానసికంగా అతి దగ్గరైన బంధం అనే అర్థంలో ఇలా పోస్ట్ చేసిందన్న మాట ఈ చిన్నది.

Comments