‘అందాల రాక్షసి’లో లావణ్య త్రిపాఠిని చూసి మైమరిచిపోయిన కుర్రాళ్లకు లెక్కే లేదు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా లావణ్య మాత్రం అలా గుర్తుండిపోయిందంతే. నిజంగానే ఆమె అందాల రాక్షసి అనిపించుకుందా సినిమాలో. ‘అందాల రాక్షసి’లో చాలా పద్ధతిగా కనిపించడం వల్ల ఆమెకు ఒక ట్రెడిషనల్ ఇమేజ్ వచ్చేసింది. ఆ తర్వాత అలాంటి పద్ధతైన క్యారెక్టర్లే వచ్చాయి.
ఐతే ఇలాంటి ఇమేజ్‌తో ఎంతో కాలం నెట్టుకు రావడం కష్టం. ఒక దశ దాటాక ఎలాంటి హీరోయిన్ అయినా గ్లామర్ అటాక్ చేయాల్సిందే. లావణ్య కూడా ఈ మధ్యే అదే బాటలో నడుస్తున్నట్లుంది. పోయినేడాది ‘రాధ’ సినిమాలో తొలిసారిగా చాలా సెక్సీగా కనిపించింది లావణ్య. ఆపై ‘ఉన్నది ఒకటే జిందగీ’లోనూ గ్లామర్ డోస్ చూపించింది. ఇప్పుడు ‘ఇంటిలిజెంట్’తో ఆమె పూర్తిగా బంధనాలు తెంచుకున్నట్లుంది.
ఈ సినిమా ప్రోమోల్లో ఎక్కడ చూసినా లావణ్యే హైలైట్ అవుతోంది. క్లీవేజ్ షోలు.. సెక్సీ పోజులతో కుర్రాళ్లకు కాక పుట్టిస్తోంది. గత ఏడాది లావణ్య నటించిన సినిమాలన్నీ తుస్సుమనిపించాయి. ఆమె కెరీర్‌కు ‘ఇంటిలిజెంట్’ చాలా కీలకం. అందుకే తన వంతుగా ఏం చేయాలో అన్నీ చేసినట్లుగా ఉంది లావణ్య. మరి ఈ ఆలౌట్ గ్లామర్ అటాక్ ఏమేరకు లాభం తెచ్చిపెడుతుందో.. సినిమాకు ఏ రకంగా కలిసొస్తుందో.. అంతిమంగా ‘ఇంటిలిజెంట్’ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో.. లావణ్య కెరీర్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
Comments
Post a Comment