Sridevi తోనా చిన్ననాటి జ్ఞాపకం : హృతిక్ రోషన్
అందరూ అందుబాటులో లేని కారణంగా శ్రీదేవికి సంతాపం తెలపడం కోసం సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. కండల వీరుడు హృతిక్ రోషన్ తన దగ్గర ఉన్న ఒక అరుదైన జ్ఞాపకాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు. తన తొలి షాట్ శ్రీదేవితోనే తీసారని - నటించడానికి వణుకుతూ భయపడుతూ ఉంటె రివర్స్ లో ఆవిడ కూడా ఆలాగే చేసి తనలో భయం పోయే దాకా నవ్విస్తూనే ఉన్నారని ఇద్దరు సరదాగా గడిపిన సమయాన్ని గుర్తు చేసుకున్నాడు హృతిక్. అందుకు సాక్ష్యంగా తన దగ్గరున్న ఫోటోను కూడా పోస్ట్ చేసిన హృతిక్ శ్రీదేవి అభిమానులకు నివాళి తో పాటు మంచి కానుకను కూడా షేర్ చేసుకున్నాడు. దీనికి రీ ట్వీట్స్ కూడా భారీగా వస్తున్నాయి.
నిన్న సాయంత్రం ముంబైకు శ్రీదేవి పార్థీవ దేహం చేరుకున్నాక ఈరోజు శాంతా క్రజ్ లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. బాలీవుడ్ తారాలోకం మొత్తం తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఉదయం దాకా సెలెబ్రిటీలతో పాటు అభిమానులు సందర్శించేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి.అధికార లాంచనాలతో ఒక గొప్ప నటికి నివాళి ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా సన్నాహాల్లో ఉంది. శ్రీదేవి హృతిక్ రోషన్ తండ్రి రాకేశ్ రోషన్ తో కలిసి మూడు సినిమాల్లో నటించారు. జాగ్ ఉటా ఇన్సాన్ - మహాగురు - భగవాన్ దాదా ఈ కాంబినేషన్ లో వచ్చాయి. మూడో దాంట్లో రజనికాంత్ కూడా నటించాడు. అప్పటి నుంచే బాలనటుడిగా హృతిక్ రోషన్ శ్రీదేవికి బాగా పరిచయం. తనను చిన్నవయసు నుంచే సాన్నిహిత్యం ఉన్న తార రాలిపోవడం హృతిక్ ని శోకంలో ముంచెత్తింది.

Comments
Post a Comment